విద్యుత్తు షాక్ తగిలి ఆసుపత్రి ప్రాంగణంలో ఆవు మృతి
రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో విద్యుత్తు షాక్ తగిలి ఒక ఆవు దుర్మరణం చెందింది. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే మనుషుల ఆసుపత్రిలో పశువులను కట్టేయడంపై స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే మూగజీవాలు బలవుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. తక్షణమే ఆసుపత్రి వద్ద నిబంధనలు కఠినతరం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.