అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తమిళనాడు

తమిళనాడు అసెంబ్లీలో సీఎం జోసెఫ్ విజయ్ విపక్ష డీఎంకేపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని విమర్శించారు. అన్నాదురై, ఎంజీఆర్, ఎన్‌టీఆర్ సరసన తన పేరును ప్రస్తావిస్తూ 2026 రాజకీయ మార్పు చారిత్రాత్మకమని చెప్పారు. డీఎంకే ఫేక్ ఇమేజ్‌ను బద్దలు కొడతామని, గత 50 ఏళ్ల చరిత్రను తవ్వి తీస్తామని అసెంబ్లీ సాక్షిగా వార్నింగ్ ఇచ్చారు.