పోచారం ఐటీ కారిడార్ పరిధిలో ఇరవై రెండు కేజీల గంజాయి స్వాధీనం

రిపోర్టర్: సతీష్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్‌లో ఉప్పల్ ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం జరిపిన తనిఖీల్లో 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. యంనంపేట నుంచి కుషాయిగూడ వైపు వెళ్తున్న బెలినో కారును ఆపి సోదా చేయగా గంజాయి లభించింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, కారును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం కాగా, పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.