మైనర్ విద్యార్థినిపై అత్యాచార నిందితుల బస్సుపై గతంలోనే 12 కేసులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Delhi

గ్రేటర్ నోయిడాలో మైనర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ప్రైవేట్ స్లీపర్ బస్సు రికార్డులను పోలీసులు పరిశీలించారు. మూడు నెలల్లోనే ఈ బస్సుపై 12 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదైనట్లు తేలింది. అతివేగం, పర్మిట్ లేకపోవడం వంటి నిబంధనల ఉల్లంఘనల కింద రూ.63 వేల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.