నైరాలో కూటమి విజయం కోసం కదంతొక్కిన నేతలు

రిపోర్టర్: JR RAO స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం రూరల్ మండలం నైరా ఎంపీటీసీ ప్రాదేశిక పరిధిలో మంగళవారం కూటమి అభ్యర్థుల తరఫున నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వంశధార ప్రాజెక్టు ఛైర్మన్ అరవల రవీంద్రతో పాటు పలువురు టీడీపీ స్థానిక నేతలు గ్రామాల్ లో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కూటమి అభ్యర్థులకు భారీ మద్దతు తెలపాలని ఓటర్లను అభ్యర్థించారు.