భువనేశ్వర్ కుమార్ కెరీర్ పై రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: న్యూఢిల్లీ

భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు ఇకపై జాతీయ జట్టులో అవకాశాలు దక్కడం చాలా కష్టమని టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో భువీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారని, అతడి బౌలింగ్ వేగం, ఇంటెన్సిటీ తగ్గిపోయాయని అశ్విన్ విశ్లేషించారు. ఇలాంటి ప్రదర్శన తర్వాత సెలెక్టర్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తారని ఆయన స్పష్టం చేశారు.