కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సొమ్ము అసోసియేషన్ల ఖాతాలకు మళ్ళింపు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన నీటిపారుదల శాఖ అధికారులు దర్యాప్తు సంస్థల కన్నుగప్పేందుకు మాస్టర్ స్కెచ్ వేశారు. అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయల సొమ్మును వ్యక్తిగత ఖాతాలకు బదులుగా వివిధ అసోసియేషన్ల బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు తెలుస్తోంది. రామగుండం సర్కిల్ పరిధిలో కీలక హోదాల్లో పనిచేసిన కొందరు ఇంజనీర్లు ఈ సంఘాలకు లీడర్లుగా వ్యవహరిస్తూ నిధులను దాచిపెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.