హైదరాబాద్ మెట్రో ఫేజ్ వన్ స్వాధీన ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad
హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీన ప్రక్రియను దసరా పండుగ నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రూ. 13,600 కోట్ల రుణ బారాన్ని తగ్గించుకోవడానికి తక్కువ వడ్డీకే రుణాలు పొందేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎస్బీఐ క్యాప్స్ సంస్థ ద్వారా బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతూ ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాలను అన్వేషిస్తున్నట్లు అధికారులు తెలిపారు.