ప్రాణాలు బలిగొన్న చిల్లర గొడవ: కండక్టర్ ప్రవళిక దుర్మరణం
రిపోర్టర్: కిరణ్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
చిల్లర విషయంలో తలెత్తిన వివాదంలో ప్రయాణికురాలు బస్సులో నుంచి నెట్టివేయడంతో తీవ్రంగా గాయపడిన మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో గత నెల 25న ఈ ప్రమాదం జరిగిందని, ఆమె మృతి ఆర్టీసీలో తీవ్ర విషాదం నింపిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.