ట్రాల్స్ కి సల్మాన్ ఖాన్ గట్టి కౌంటర్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Mumbai
ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ప్రసవానంతరం ఎదుర్కొన్న ట్రోలింగ్‌పై స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ముంబైలో అంబానీ ఇంట్లో జరిగిన గణపతి పూజలో పాల్గొన్న కత్రినాపై నెటిజన్లు చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్‌ను ఆయన తప్పుపట్టారు. వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేసే వారిపై సల్మాన్ మండిపడ్డారు. ప్రెగ్నెన్సీ తర్వాత బరువు పెరగడం సహజమని, మళ్లీ సినిమాల్లోకి వచ్చేటప్పుడు వారు ఫిట్ అవుతారని ఆయన స్పష్టం చేశారు.