మోత్కూరులో మినీ స్టేడియం కడీల చోరీ వ్యవహారంపై పోలీసుల కేసు
రిపోర్టర్: Srinivasulu akavaram
స్థలం: మోత్కూరు
మోత్కూర్ పోలీస్స్టేషన్ పరిధిలో మినీ స్టేడియానికి సంబంధించిన సుమారు 300 రాతి కడీలు చోరీకి గురైనట్లు అందిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మున్సిపాలిటీకి చెందిన పల్లపు లెవ్య ఫిర్యాదు మేరకు ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు.