వైస్‌చైర్మన్ పిలిస్తేనే పనులకు వెళ్లామంటున్న కడీల చోరీ నిందితులు
రిపోర్టర్: Srinivasulu akavaram
స్థలం: మోత్కూరు
మోత్కూర్ మినీ స్టేడియం కడీల చోరీ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని, వైస్‌చైర్మన్ పల్లెర్ల వెంకన్న పిలవడం వల్లనే కూలి పనికి వెళ్లామని కేసు నమోదైన ఏడుగురు వ్యక్తులు తెలిపారు. కడీలు ప్రభుత్వ ఆస్తి అని తమకు తెలియదని, తమను పనికి పిలిచిన వారిపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు వినతిపత్రం అందజేశారు.