హెల్త్ టెక్ బ్రాండ్‌లో భారీ పెట్టుబడులు పెట్టిన క్రిస్టియానో రొనాల్డో

రిపోర్టర్: వెంకట్ స్థలం: Global

ప్రముఖ ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో పెట్టుబడుల ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ వేరబుల్ టెక్నాలజీ కంపెనీ హూప్ సంస్థలో రొనాల్డో భారీ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. ఈ సంస్థ నిర్వహించిన పది బిలియన్ డాలర్ల నిధుల సేకరణలో ఆయన కీలక పాత్ర పోషించారు. భవిష్యత్తుపై నమ్మకంతోనే తాను ఈ పెట్టుబడి పెట్టినట్లు రొనాల్డో స్పష్టం చేశారు. క్రీడలతో పాటు వ్యాపార రంగంలోనూ ఆయన దూసుకెళ్తున్నారు.