హైవే విస్తరణ: ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు నాలుగు లేన్లుగా రోడ్డు నిర్మాణం

రిపోర్టర్: సునీల్ స్థలం: నిజామాబాద్

ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు. రాబోయే రెండు నెలల్ లో ఈ పనులు పట్టాలెక్కే అవకాశం ఉందని వారు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు అటవీ శాఖతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపిందని, భూ యజమానులకు అవార్డులు అందించే ప్రక్రియ కూడా మొదలైందని అధికారులు స్పష్టం చేశారు.