మైసా మూవీ అప్డేట్: రష్మిక మందన్న సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మైసా అని చిత్రబృందం వెల్లడించింది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఓ మైసా రే పేరుతో రూపొందించిన ఫస్ట్ సింగిల్ ప్రోమోను నవంబర్ ఒకటో తేదీన విడుదల చేసినట్లు తెలిపారు. పూర్తి పాటను నవంబర్ రెండో తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు.