నెత్తురోడిన జాతీయ రహదారిపై లారీ ఢీకొని నలుగురు దుర్మరణం
రిపోర్టర్: నరేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్ధవరం గ్రామం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. చెల్లటూరుకు చెందిన శివారెడ్డి, తాటిపల్లికి చెందిన గోపాల్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ వారి బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో శివారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన గోపాల్ను స్థానికులు 108 సహాయంతో రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.