ఖమ్మంలో ఘనంగా జరిగిన ఏఐటీయూసీ నూట ఏడో ఆవిర్భావ వేడుకలు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం రోటరీ నగర్లోని వంద సంవత్సరాల పైలాన్ వద్ద ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సమితి సభ్యులు సింగ్ నరసరావు, జిల్లా అధ్యక్షులు రావి శివరామకృష్ణ, కార్యదర్శి తోట రామాంజనేయులు, ఉపాధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ, సీతామహాలక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు గాంధీ, మమత ఆటో యూనియన్ అధ్యక్షులు ప్రతాపని ఉపేందర్ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.