తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫార్మా, ఏరోస్పేస్, ఏఐ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని స్వాగతించారు.