మురుగు కాల్వలతో నరకం చూస్తున్న మోత్కూర్ వడ్డెర కాలనీవాసులు

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూర్

మోత్కూర్ మున్సిపాలిటీలోని వడ్డెర కాలనీలో మురుగు కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయి అధ్వానంగా తయారయ్యాయి. నెలల తరబడి మోరీలను శుభ్రం చేయడం లేదని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారికి సమీపంలోనే ఈ పరిస్థితి ఉన్నా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.