స్వగ్రామంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జి.కె.వీధి

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం మండలం సంకడా పంచాయతీ పరిధిలోని చిన్నజాడుమూరు గ్రామంలో వినాయక చవితి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పాండు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండు రాజు గారు, గౌరమ్మ అమ్మ గారు తమ సొంత గ్రామంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. గ్రామ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దేశగిరి కృష్ణ రావు గారు మరియు స్థానిక గ్రామస్థులు, అల్లూరి యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.