పార్వతీపురం మన్యం జిల్లాలో సైక్లోన్ ప్రభావంపై అధికారిక అప్రమత్తత

రిపోర్టర్: విజయ్ స్థలం: పార్వతీపురం మన్యం

పార్వతీపురం మన్యం జిల్లాలో 'సైక్లోన్ అర్నాబ్' ప్రభావంపై జిల్లా కలెక్టర్ అధికారికంగా హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.