ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఈవీఎంలపై బురదజల్లడం ఆపండి: ఎంపీ డి.కె. అరుణ
రిపోర్టర్: కిరణ్
స్థలం: మహబూబ్ నగర్
ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఈవీఎంలు మరియు ఓటర్ల జాబితాపై బురదజల్లడం ఆపాలని మహబూబ్ నగర్ ఎంపీ డి.కె. అరుణ స్పష్టం చేశారు. తమిళనాడు, బెంగాల్, బిహార్ వంటి ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా అధికారంలో లేదని ఆమె గుర్తుచేశారు. అదంతా ఓట్ల దొంగతనం అయితే, నాడు ఆ పార్టీని ఓడించిన వారే నేడు ఇండియా కూటమిలో పక్కన కూర్చున్నారని ఆమె తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.