ఢిల్లీ వేదికగా దేశ్ బచావో సదస్సులో కదంతొక్కిన జన్నారం యువత

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

ఢిల్లీలో జరిగిన ఓటు బచావో దేశ్ బచావో కార్యక్రమంలో జన్నారం ఎన్ఎస్ యుఐ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అలాగే బెల్లంపెల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ లను కలిసి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షుడు సోహైల్ షా తదితర నాయకులు పాల్గొన్నారు.