బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏపీలో అధికార యంత్రాంగం అప్రమత్తం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని సంపూర్ణంగా అప్రమత్తం చేశారు. విశాఖపట్నం – గోపాల్‌పూర్ మధ్య ఇది తీరం దాటే అవకాశముండటంతో, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే 261 మండలాల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.