తుపాను ముప్పు వేళ అప్రమత్తత అవసరం: అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

తుపాను పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. డిస్కంల సీఎండీలు మరియు జిల్లాల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. భారీ వర్షాలు, ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ప్రాణ, ఆస్తినష్టం తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర హోర్డింగ్లను వెంటనే తొలగించాలని సూచించారు. విద్యుత్ సమస్యలపై ప్రజలు టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.