రాష్ట్రంలో పోలీస్ కొలువుల సాధనకు తీవ్రంగా శ్రమిస్తున్న అభ్యర్థులు
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
పోలీస్ కొలువు సాధనే ధ్యేయంగా అభ్యర్థులు కసరత్తు తీవ్రతరం చేశారని ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం వెల్లడించింది. రాష్ట్రంలో పోలీస్, ఫైర్, జైళ్లు తదితర విభాగాల్లో 2,050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో నిరుద్యోగ యువత పుస్తకాలు, గ్రౌండ్ల బాటపట్టింది. రాత పరీక్షతో పాటు శారీరక సామర్థ్య పరీక్షల కోసం ఉదయం గ్రౌండ్లలో, పగటివేళ కోచింగ్ సెంటర్లలో అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తొలిసారి పోటీ పడుతున్నవారితో పాటు గతేడాది అవకాశాలు కోల్పోయిన వారు ఈసారి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.