నిరుద్యోగులకు గుడ్ న్యూస్: నెల రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
రాష్ట్రంలో నెల రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం చేయాలని అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చే వరకూ ప్రతి దశలోనూ పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. అలాగే పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా మిషన్ మార్చ్‌ను అమలు చేయాలని, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని సూచించారు.