టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో వస్తున్న కొత్త సినిమా
రిపోర్టర్: రాము
స్థలం: India
టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత పొడవైన పేరుతో ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, డోల్ రవి మొదలగువారు’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తెరకెక్కించిన ఈ వినూత్న చిత్రం, పాతకాలపు రేడియో అనుభూతులను గుర్తుచేస్తూ ఈనెల 18న విడుదల కానుంది. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.