జన్నారం నుంచి ఆసిఫాబాద్‌కు వెంటనే ఆర్టీసీ బస్సు సర్వీస్ నడపాలంటూ ప్రయాణికుల వేడుకోలు
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం నుండి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతానికి చెందిన అనేక మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రయాణానికి నేరుగా ఆర్టీసి బస్సులు నడపాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.