తుపానుల్ని సమర్థంగా ఎదుర్కొన్నాం: ఆస్తి నష్టాన్ని తగ్గించామన్న సీఎం చంద్రబాబు
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
అర్నబ్, మురసు తుపానులను సమర్థంగా ఎదుర్కొని ప్రాణ, ఆస్తి నష్టాలను భారీగా తగ్గించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో విలేకర్లతో మాట్లాడుతూ, సహాయక చర్యల్ లో భాగంగా ఐదు వేల మంది గర్భిణులను ఆసుపత్రులకు తరలించామని తెలిపారు. సకాలంలో అప్రమత్తమై జిల్లాల కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్సులు నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టడం వల్లే సాధారణ పరిస్థితులు సాధ్యమయ్యాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.