శ్రీ సత్యసాయి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రత

రిపోర్టర్: భాస్కర్ స్థలం: శ్రీ సత్యసాయి

శ్రీ సత్యసాయి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా అలాగే స్వేచ్ఛాయుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని చర్యలు చేపట్టిందని సత్యసాయి పోలీస్ వెల్లడించారు. ఈ నెల ఐదవ తేదీన జరగనున్న పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ పోలీసు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఓటర్లు నిర్భయంగా తమ హక్కును వినియోగించుకోవాలని సూచించారు.