శ్రీకాకుళంలో లోతట్టు ప్రాంతాల పరిశీలన చేపట్టిన గోండు శంకర్

రిపోర్టర్: విజయ్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళంలో నాగావళి నది ఉధృతి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో గోండు శంకర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. కెళ్ళవీధి, రెళ్లివీధి, ఏపీహెచ్బీ, ఎల్బీఎస్ కాలనీలలో పరిస్థితిని స్వయంగా పరిశీలించి, నీరు రాకుండా ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేయించారు. అలాగే డే అండ్ నైట్ జంక్షన్, తిలక్ నగర్, ఎస్బీఐ కాలనీలలో డ్రైనేజీ పూడికతీత పనులను వేగవంతం చేశామని వెల్లడించారు. పరిస్థితులు పూర్తిగా యథాస్థితికి వచ్చే వరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.