చలో అసెంబ్లీకి పిలుపు.. బీజేపీ నేత అడప రాజు అరెస్ట్
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో, వర్ధన్నపేట మండల బీజేపీ అధ్యక్షుడు అడప రాజును పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
చలో అసెంబ్లీకి తరలివెళ్లకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం ఆగదని బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.