కేసీఆర్ భవనాన్ని రేవంత్ ప్రారంభిస్తున్నారంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కరీంనగర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో నిర్మించిన కరీంనగర్ కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం ముందు కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తామే అన్ని నిర్మించినట్లు కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ కట్టిన భవనాలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటూ ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు.