బెల్లంపల్లి పట్టణంలో అరుదుగా విరబూసిన పవిత్ర బ్రహ్మ కమలం పుష్పం

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కన్నాలబస్తికి చెందిన లావణ్య రమేష్ దంపతుల ఇంటి ఆవరణలో అరుదైన బ్రహ్మ కమలం విరబూసింది. సాధారణంగా హిమాలయాల్లోని ఎత్తైన కొండలు, లోయల్లో మాత్రమే పూసే ఈ పుష్పం సంవత్సరంలో ఒక్క రాత్రి మాత్రమే వికసిస్తుందని తెలిపారు. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించే ఈ కమల దర్శనంతో సకల శుభాలు కలుగుతాయని స్థానికులు విశ్వసిస్తున్నారు. అరుదైన పుష్పం తమ ఇంట్లో వికసించడం అదృష్టంగా భావిస్తున్నామని వారు ఆనందం వ్యక్తం చేశారు.