జన్నారం: పోన్కల్లో సర్ హీయరింగ్ గ్రామసభ.. నోటీసుదారులు సిద్ధం కావాలి

రిపోర్టర్: p.g. murthy స్థలం: జన్నారం

జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో సోమవారం సర్ హీయరింగ్ గ్రామసభను నిర్వహించనున్నారు. గ్రామంలోని పలువురికి అధికారులు ఇటీవల సర్ నోటీసులను జారీ చేసిన నేపథ్యంలో, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

నోటీసులు అందుకున్న వారు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ధ్రువపత్రాలలో ఏదో ఒకటి తీసుకువచ్చి, బూత్ లెవెల్ అధికారులకు అందజేయాలని సూచించారు. పోన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఈ సభ జరుగుతుందని, సంబంధిత వ్యక్తులు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు పేర్కొన్నారు.