నీటి సమస్యకు ఎల్‌నినో, కేసీఆర్ అసమర్థ విధానాలే కారణం: మంత్రి ఉత్తమ్

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

రాష్ట్రంలో నీటి ఎద్దడికి ఎల్‌నినోతో పాటు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అసమర్థ సాగునీటి విధానాలే ప్రధాన కారణమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రూ.1.81 లక్షలు ఖర్చు చేసినా ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగితే కేసీఆర్ ఏం చూపిస్తారని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రాజెక్టులను అసంపూర్తిగా వదిలేసిన బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు.