'ఇంటింటికీ తెలుగుదేశం': ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేతలు

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేసే లక్ష్యంతో 'రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం' కార్యక్రమంలో భాగంగా 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ క్షేత్రస్థాయిలో నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు.