రింతాడ పంచాయతీలో హోరెత్తిన కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార భేరీ

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: జి.కె.వీధి

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం రింతాడ పంచాయతీ పరిధిలో కూటమి బలపరిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి పాంగి కృష్ణరావు వంశీ నాయకత్వంలో స్థానిక నేతలు వివిధ గ్రామాలు సందర్శించి నేరుగా ఓటర్లను అభ్యర్థించారు. గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్న రింతాడ-1 ఎంపీటీసీ అభ్యర్థి గెమ్మెలి పాల్స్, సైకిల్ గుర్తుపై నిలిచిన రింతాడ-2 ఎంపీటీసీ అభ్యర్థి సాగిన భీమేష్ పాడల్కు మద్దతుగా పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ప్రచారం ముమ్మరం చేశారు.