నెల్లూరులో నాలుగు లైన్ల రహదారి ప్రారంభం: వాయుపుత్ర మార్గ్గా నామకరణం చేసిన పవన్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నెల్లూరు

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో రూ. 8.91 కోట్ల వ్యయంతో 2.2 కిలోమీటర్ల మేర నిర్మించిన నాలుగు లైన్ల రహదారిని ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ మార్గానికి వాయుపుత్ర మార్గ్ అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.