నాగలాపురం పాఠశాల విద్యా కమిటీ చైర్మన్గా కేశవులు ఏకగ్రీవ ఎన్నిక

రిపోర్టర్: KISHORE M స్థలం: ఆదోని

ఆదోని మండలం నాగలాపురం పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. టిడిపి ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు జరిగిన ఈ ఎన్నికల్లో చైర్మన్గా కేశవులు, వైస్ చైర్మన్గా మహాదేవ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి నాయకులు, తల్లిదండ్రుల సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తయింది. నూతన కమిటీ సభ్యులు పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.