వలిగొండలో బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు.. తీవ్ర నిరసన

రిపోర్టర్: BALUGURI VENKHATAREDDY స్థలం: వలిగొండ

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో ఇందిరా పార్క్ ధర్నాకు వెళ్లకుండా బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని మండల పార్టీ అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్ మండిపడ్డారు.

అరెస్టులతో ప్రజా పోరాటాలను ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బంధారపు లింగస్వామి, కనతాల అశోక్ రెడ్డి, రాచకొండ కృష్ణ తదితరులు అరెస్టయిన వారిలో ఉన్నారు.