మధ్యప్రదేశ్ లో బాలికపై మైనర్ అత్యాచారం

రిపోర్టర్: కిరణ్ స్థలం: మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో పదహారేళ్ల బాలికపై పదిహేడేళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కోచింగ్ కు వెళ్తున్న బాలికను బైక్ పై అడ్డగించిన నిందితుడు, ప్రైవేట్ ఫోటోలు, చాట్ లు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి ఒక ఫ్లాట్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు.