ప్రజాస్వామ్య పరిరక్షణకై నిరంతరం శ్రమించిన సీతారాం ఏచూరి
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో సీపీఎం మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రెండో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక అమరజీవి కందాల రంగారెడ్డి స్మారక భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కార్మికులు, రైతులు, పేదల పక్షాన ఏచూరి సాగించిన పోరాటాలను కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మన ముందున్న కర్తవ్యమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.