భారతీయ స్వతంత్ర సంస్థగా మారనున్న నథింగ్ సబ్ బ్రాండ్ సిఎంఎఫ్
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ టెక్ స్టార్టప్ నథింగ్ సబ్‌బ్రాండ్ అయిన సిఎంఎఫ్ ఇకపై పూర్తిస్థాయి స్వతంత్ర భారతీయ సంస్థగా మారనుంది. ఈ బ్రాండ్‌ను నథింగ్ మాతృ సంస్థ నుంచి వేరు చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో, వ్యవస్థాపకుడు కార్ల్ పే అధికారికంగా ప్రకటించారు. భారత్‌లో తమ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ను మరింత విస్తరించి, అంతర్జాతీయంగా తిరుగులేని శక్తిగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.