యాదాద్రి ఆలయం వద్ద కారు ఢీకొని యాచకురాలు మృతి

రిపోర్టర్: గోపి స్థలం: యాదాద్రి భువనగిరి జిల్లా

యాదాద్రి ఆలయం వద్ద మంగళవారం కారు ఢీకొని యాచకురాలు ఈశ్వరమ్మ అక్కడిక్కడే దుర్మరణం చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కారణంగా ఆలయ అధికారులు కొంతసేపు దర్శనాలు నిలిపివేసి, సంప్రోక్షణ అనంతరం తిరిగి పునరుద్ధరించారు.