సాహిత్యం సమాజాన్ని చైతన్యపరిచే శక్తివంతమైన సాధనమన్న వీఎస్యూ ఉపకులపతి
రిపోర్టర్: sai
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు పంచాయతీలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో డా. పెరుగు రామకృష్ణ రచించిన పిడికిలి వదిలినప్పుడు కవితా సంపుటిని వీఎస్యూ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు ఆవిష్కరించారు. సమాజంలో వస్తున్న మార్పులు, మానవ సంబంధాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను కవులు తమ రచనల్లో ప్రతిబింబించాలని ఆయన సూచించారు. మంచి సాహిత్యం ఆలోచనను రేకెత్తించడంతో పాటు మానవీయ విలువలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు.