పులివెందులలో పోలీసులపై దాడి ఘటన: 562 మందిపై కేసుల నమోదు
రిపోర్టర్: నరేష్
స్థలం: కడప
పులివెందులలో పోలీసులపై జరిగిన దాడుల ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు ఏకంగా ఐదు వందల అరవై రెండు మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రాఘవరెడ్డి, వరప్రసాద్‌రెడ్డి, కిశోర్‌లతో పాటు పలువురిపై అల్లర్లు మరియు హత్యాయత్నం అభియోగాలు మోపినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘర్షణల్లో సీఐ, ఎస్ఐ తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు.