క్షేత్రబంధన్ పోరాట స్ఫూర్తితో ఆదివాసీల హక్కులకై ఐక్యంగా సాగాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
నాందేడ్ జిల్లా కిన్వట్లో నిర్వహించిన ఆదివాసీ క్షేత్రబంధన్ ముక్తి దిన కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని మాట్లాడారు. ఆదివాసీల ప్రత్యేక గుర్తింపు, ఆచారాలు, సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. జనగణనలో ఆదివాసీలకు ప్రత్యేక మత కోడ్ కల్పించాలనే డిమాండ్‌కు మద్దతు తెలిపారు. భూమి, అటవీ హక్కులు మరియు విద్య, ఉపాధి రంగాలలో ఆదివాసీలకు పూర్తి న్యాయం జరిగేలా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.