ఆకట్టుకుంటున్న వెంకటేశ్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ టీజర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమా టీజర్ విడుదలయింది. కుటుంబ అనుబంధాలు, వినోదంతో కూడిన ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.